Pawan Kalyan Sweet Shock to Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు కూడా నడపాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను ఆయన లైన్ లో పెట్టారు. వాటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ఈ మధ్యనే పూర్తయింది. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ సినిమాను పూర్తి చేసి చాలా కాలమే అయినా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో ఆయన ఎప్పుడు డేట్ ఇస్తాడనే విషయంలో మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వరేమో అని ఇతర పనుల్లో బిజీగా ఉన్న హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఊహించని షాక్ ఇచ్చారట. అదేమిటంటే 15 రోజులపాటు ఈ సినిమాకి డేట్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారట.


Also Read: Brahmanandam Campaign: బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం.. ఎవరి కోసమో తెలిస్తే షాకవుతారు!


నిజానికి మొదటి షెడ్యూల్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ షెడ్యూల్ డేట్స్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదట. దీంతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ సినిమాకి డేట్స్ కేటాయించడానికి సమయం పడుతుందని అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి హరీష్ శంకర్ కి ఫోన్ వచ్చింది. ఈనెల మూడో వారం నుంచి 15 రోజులు పాటు డేట్స్ ఖాళీగా ఉన్నాయని షూటింగ్ అప్పుడు పెట్టుకోమని పవన్ కళ్యాణ్ చెప్పారట.


దీంతో ఈ ఊహించని షాక్ తిన్న వెంటనే హరీష్ శంకర్ షూటింగ్ షెడ్యూల్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లొకేషన్స్ కోసం వెతుకుతున్న డైరెక్టర్ హరీష్ శంకర్, డైరెక్టర్ ఆ ఫోటోగ్రఫీ అయాంక బోస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇక ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ మైత్రి మూవీస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తలపతి విజయ్ హీరోగా నటించిన తేరీ సినిమాకి రీమేక్ అని చెబుతున్న పూర్తిగా కథ మార్చేశామనే ప్రచారం కూడా జరుగుతోంది.
Also Read: Rashmika Mandanna Dating: బెల్లంకొండ డేటింగ్ రూమర్స్ పై రష్మిక సైలెన్స్.. ఎందుకబ్బా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook